భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కంటిన్యూ

భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. 51.7 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది

Update: 2022-09-14 03:14 GMT

భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. 51.7 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. దీంతో 13,45,556 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రెండు నెలల్లో మూడు సార్లు గోదావరికి వరద వచ్చింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

పంటపొలాలన్నీ....
గోదావరి వరద ఉధృతితో పంటపొలాలన్నీ నీట మునిగాయి. రహదారులన్నీ నీటితో నిండిపోయి రాకపోకలు స్థంభించిపోయాయి. మూడు సార్లు వచ్చిన వరదలతో గోదావరి ప్రాంత ప్రజలు ఇబ్బంది పడ్డారు. నాలుగోసారి కూడా వరద వస్తుండటంతో ప్రజలు వణికి పోతున్నారు. వరదలతో ఈ ఏడాది తాము పూర్తిగా నష్టపోయామని, పరిహారం కూడా ఇంతవరకూ అందలేదని వాపోతున్నారు.


Tags:    

Similar News