ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆలస్యమైనా ఓకే..
ఎగ్జామినర్లుగా నియమితులైన అధ్యాపకులను విధుల నుంచి రిలీవ్ చేయాలని, లేదంటే రూ. 5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ బోర్డు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 9 వరకూ ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రాక్టికల్స్ కు హాజరు కావడం 15 నిమిషాలు ఆలస్యమైనా అనుమతించాలని కళాశాలలకు ఆదేశాలిచ్చింది ఇంటర్ బోర్డు. 15 నిమిషాల తర్వాత వచ్చిన విద్యార్థులను మాత్రం అనుమతించరాదని బోర్డు కార్యదర్శి జలీల్ ఆదేశాల్లో పేర్కొన్నారు.
అలాగే.. ఎగ్జామినర్లుగా నియమితులైన అధ్యాపకులను విధుల నుంచి రిలీవ్ చేయాలని, లేదంటే రూ. 5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు ఎగ్జామినర్లు వేసిన మార్కులను అదే రోజు రాత్రి 8 గంటలలోపు ఆన్‌లైన్‌లో బోర్డుకు పంపాలన్నారు. విద్యార్థులకు వారు చదువుతున్న కాలేజీల్లోనే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. జాగ్రఫీ విద్యార్థులకు మాత్రం మార్చి 31వ తేదీ నుంచి ప్రాక్టికల్స్ ఆరంభం కానున్నాయి.