Telangana : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మూడు రోజులు సెలవులు
తెలంగాణలో విద్యార్థులకు మూడు రోజుల పాటు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది;

తెలంగాణలో విద్యార్థులకు మూడు రోజుల పాటు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. విద్యాసంస్థలకు మూడు రోజలు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 26వ తేదీన శివరాత్రికి, 27న ఎమ్మెల్సీ ఎన్నికలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే 24 జిల్లాల్లో ఈ సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయిం తీసుకుంది.
వరస సెలవులతో...
తిరిగి మార్చి మూడో తేదీన కౌంటింగ్ ఉండటంతో ఆరోజు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే 24 జిల్లాలకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయని, మిగిలిన జిల్లాల్లో 26వ తేదీ ఒక్కరోజు మాత్రమే విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని తెలిపారు.