తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్ 4 పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్ 4 పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 9,168 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించేందుకు సిద్ధమయింది. టీఎస్ పీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అంగీకారం తెలపడంతో నిరుద్యోగుల్లో ఆశలు రేగాయి.
ఎన్నాళ్ల నుంచో....
ఎన్నాళ్ల నుంచో ఈ పోస్టుల కోసం నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నారు. వరసగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 9,168 పోస్టులను భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు వెన్నుదన్నుగా నిలిచామని వచ్చే ఎన్నికల్లో చెప్పుకునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీకి వీలు కలిగింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది.