డీజీపీ కోసం సూపర్ పోస్టు రెడీ
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కోసం ప్రభుత్వం సూపర్ పోస్టును రెడీ చేసి సిద్ధంగా ఉంచింది.
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కోసం ప్రభుత్వం సూపర్ పోస్టును రెడీ చేసి సిద్ధంగా ఉంచింది. ఆయనను ఆ పోస్టులో నియమించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. హైదరాబాద్ లో ఇటీవల ప్రారంభించిన TSPICCC ఛైర్మన్ పోస్టును ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్ హోదాలో నియమించనుంది.
కేబినెట్ హోదాలో...
ఈ పదవి కేబినెట్ హోదాలో నియమించనుంది. త్వరలోనే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడుతాయని తెలిసింది. ప్రస్తుత డీజీపీగా మహేందర్ రెడ్డి ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. ఈ పోస్టు కింద టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో విభాగాలు కూడా ఉంటాయని తెలిసింది.