మరో మూడు రోజులే సమయం.. ఛార్జీలు పెరగనున్నాయ్
తెలంగాణలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ, పెరిగిన వ్యవసాయేతర భూముల విలువ ప్రకారం వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ రాష్ట్రంలోని అన్ని కార్యాలయాలకు ప్రతిపాదనలను పంపింది. ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునే మార్గంలో భాగంగా భూముల విలువను పెంచాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఉన్న విలువలో....
ప్రస్తుతం ఉన్న విలువలో వ్యవసాయ భూముల మార్కెట్ విలువను 50 శాతం, ఖాళీగా ఉన్న స్థలాలకు 35 శాత, అపార్ట్ మెంట్ల విలువను ఇరవై ఐదు నుంచి ముప్ఫయి శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోనున్నారు. పెరిగిన ఛార్జీలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో తెలంగాణ అంతటా రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో రద్దీ పెరిగింది. ఛార్జీలు పెరగకముందే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కార్యాలయాల వద్ద జనం బారులు తీరుతున్నారు.