Telangana : తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు.. ఇరవై మంది ఐఏఎస్‌లపై?
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇరవై మంది ఐఏఎస్ అధికారులను చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నికల కోడ్ ముగియడంతో పాలన సజావుగా సాగేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రక్షాళన ప్రారంభించారు. జిల్లా కలెక్టర్లతో పాటుగా వివిధ శాఖ ఉన్నతాధికారులపై కూడా బదిలీవేటు పడింది.
జిల్లా కలెక్టర్లుగా...
నాగర్ కర్నూలు కలెక్టర్ గా సంతోష్ ను నియమించారు. ఖమ్మం కలెక్టర్ గా మోజామిల్ ఖాన్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా, కరంననగర్ అనురాగ్ జయంతి, కామారెడ్డి కలెక్టర్ గా ఆశిష్ స్వాంగాన్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గా జితేష్ వి పాటిల్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా రాహుల్ శర్మను నియమించారు. మరికొందరు కలెక్టర్లకు కూడా బదిలీ అయయారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించారు.