మూడు గంటల్లో పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి

వనపర్తి జిల్లాకు చెందిన యువతితో నిన్న ఉదయం 11 గంటలకు చర్చిలో వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇంతలో..;

Update: 2022-02-11 04:52 GMT
accident, ananthapuram, three people died
  • whatsapp icon

మరో మూడు గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా.. రోడ్డు ప్రమాదం రూపంలో వరుడిని మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన మహబూబ్ నగర్ లో జరిగింది. వరుడి మృతితో వధూవరుల ఇంట తీరని విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబ్ నగర్ లోని క్రిస్టియన్ పల్లికి చెందిన భువనాల చైతన్యకుమార్ (35) ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నారాయణపేట జిల్లాలోని తిర్మాలాపూర్‌లో పనిచేస్తున్నాడు. ఇటీవలే అతనికి పెళ్లి నిశ్చయమయింది.

Also Read : 
గ్రేట్ రిలీఫ్... కరోనా కేసులు అట్టడుగుకు
వనపర్తి జిల్లాకు చెందిన యువతితో నిన్న ఉదయం 11 గంటలకు చర్చిలో వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వరుడు చైతన్య కుమార్ నిన్న ఉదయం 8 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కారులో జడ్చర్ల బయల్దేరాడు. మార్గమధ్యంలో నక్కలబండ తండా మలుపు వద్ద చైతన్య నడుపుతున్న కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చైతన్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News