Telangana : మరికాసేపట్లో గ్రూప్ వన్ మెయిన్స్
గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకున్నారు.
గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకున్నారు. గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలకు దాదాపు ముప్ఫయి ఒక్క వేల మంది హాజరుకానున్నారు. 1.30 గంటల వరకే పరీక్ష కేంద్రాల తలుపులు తెరచుకుంటాయి. తర్వాత ఎవరినీ అనుమతించరు. ప్రతి సెంటర్ లో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.
563 పోస్టుల కోసం...
563 పోస్టుల కోసం ఈ మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని మొత్తం 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవడానికి జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఈ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. గ్రూప్ వన్ పరీక్షకు సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మధ్యాహ్నం రెండు గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. ఈరోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి.