Kalvakuntla Kavitha : నేడు కవిత బెయిల్ పిటీషన్ పై విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది;

Update: 2024-05-27 03:47 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. కవిత బెయిల్ పిటీషన్లను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత మార్చి 15వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల రూపాయల ముడుపులు అందించే ప్రక్రియలో కీలక పాత్ర పోషించారని ఈడీ ఆరోపించింది.

రెండున్నర నెలల నుంచి...
ఈడీ అరెస్ట్ తర్వాత ఇదే కేసులో సీబీఐ కూడా కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసింది. దాదాపు రెండున్నర నెలల నుంచి కవిత తీహార్ జైలులో ఉన్నారు. ఈ స్కాంలో తన ప్రమేయం లేదని, రాజకీయ కక్షతోనే తనను ఇరికించారని కవిత తరుపున న్యాయవాదులు వాదిస్తున్నారు. కవితకు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలయిన పిటీషన్లను ట్రయల్ కోర్టు కొట్టివేయడంతో ఆమె తరుపున న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు కవిత బెయిల్ పిటీషన్ పై విచారణ జరగనుంది.


Tags:    

Similar News