నేడు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణ
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విచారణ నేడు సుప్రీంకోర్టులో జరగనుంది.
group 1 mains exam
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విచారణ నేడు సుప్రీంకోర్టులో జరగనుంది. ఇప్పటికే పలుమార్లు విచారించిన అత్యున్నత ధర్మాసనం చర్యలకు ఎంత సమయం కావాలని శాసనసభ కార్యదర్శిని ప్రశ్నించిన నేపథ్యంలో నేటి విచారణ కీలకంగా మానుంది. తెలంగాణలో 2023 ఎన్నికల్లో జరిగిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కాంగ్రెస్ కు మద్దతుదారులుగా మారిన సంగతి తెలిసిందే.
అనర్హత వేటు వేటు వేయాలంటూ...
వీరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఈ విషయంపై సీరియస్ గా పరిగణనలోకి తీసుకుని అనేక విధాలుగా కామెంట్స్ చేయడంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్న నేపథ్యంలో నేటి విచారణ ఎలా సాగుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.