Telangana : నేడు కేసీఆర్ పిటీషన్ పై విచారణ

జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ కేసీఆర్ వేసిన పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది

Update: 2024-06-28 02:07 GMT

విద్యుత్తు కొనుగో‌ళ్లు, ఒప్పందాలు, థర్మల్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ కేసీఆర్ వేసిన పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈమేరకు హైకోర్టులో నేడు విచారణకు నంబర్ ను కేటాయించాలని ధర్మాసనం నిర్ణయించిదంి. జస్టిస్ ఎల్. నరసింహారెడ్డితో ఏర్పాటు చేసిన విచారణ సంఘంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యంతరం తెలుపుతూ, కమిషన్ ను రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.

మీడియా సమావేశం పెట్టి...
ప్రతివాదులుగా జస్టిస్ నరసింహారెడ్డిని చేర్చడంపై రిజిస్ట్రీ తొలుత అభ్యంతరం తెలిపినా, కేసీఆర్ తరుపున ఆదిత్య సోంధి వాదనతో ధర్మాసనం ఏకీభవించి ఈ కేసుకు సంబంధించిన నెంబరు కేటాయించాలని ఆదేశించింది. జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ ఛైర్మన్ గా ఉండి మీడియా సమావేశం విచారణ ముందే పెట్టడాన్ని కేసీఆర్ తరుపున న్యాయవాది తప్పుపట్టారు. విచారణపై స్టే విధించాలని కేసీఆర్ తరుపున న్యాయవాది కోరారు. ఈరోజు విచారణకు చేపడతామని ధర్మాసనం వెల్లడించింది.


Tags:    

Similar News