KTR : నేడు కేటీఆర్ పిటీషన్ పై సుప్రీంలో విచారణ
నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది;
నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫార్ములా ఈ-రేసు కేసులో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంలో కేటీఆర్ వేసిన పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తనపై ఏసీబీ కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో కేటీఆర్ వేసిన పిటీషన్ ను క్వాష్ చేసేందుకు హైకోర్టు నిరాకరించడంతో సుప్రీంకోర్టుకు కేటీఆర్ వెళ్లారు.
రేపు ఈడీ విచారణ...
ఇప్పటికే ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ఒక విడత విచారణ చేశారు. మరో సారి విచారణకు రావాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 16వ తేదీన కేటీఆర్ కు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో నేడు విచారణలో ఏమి జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది.