గవర్నర్‌కు సుఖేష్ రాసిన లేఖపై.. కేటీఆర్‌ రియాక్షన్‌ ఇదే.!

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌లపై ఫిర్యాదు చేస్తూ.. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన

Update: 2023-07-14 10:07 GMT

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌లపై పలు ఆరోపణలు చేస్తూ.. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ రాశాడు. ''నా వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్ తరపు సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారు. కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్లలోని ఎవిడెన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఆధారాలు ఇస్తే రూ.100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీట్ ఇస్తామని ఆశపెడుతున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. కవితకు నాకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ అంతా రికార్డింగ్ ఉంది. ఈ ఆధారాలని ఇప్పటికే ఈడీకి 65 -బి సర్టిఫికెట్ రూపంలో ఇచ్చేశా. కవిత నుంచి రూ.15 కోట్ల నగదు తీసుకొని అరవింద్ కేజ్రీవాల్ తరపు వారికి అందజేశా. ఈ అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతున్నా'' అంటూ లేఖ రాశాడు.

సుఖేష్‌ చేసిన ఆరోపణలపై తెలంగాణ ఐటీ, పుర‌పాలిక‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా శుక్ర‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సుకేష్ చంద్ర‌శేఖ‌ర్‌ను భ్ర‌మ‌లు క‌లిగించే మోస‌గాడు అంటూ మండిప‌డ్డారు. అవినీతి, ఆరోప‌ణ‌ల‌తో ఇప్ప‌టికే జైలు చిప్ప కూడు తింటున్నాడు. త‌ను ప‌దే ప‌దే నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నాపై కొన్నిహాస్యాస్ప‌ద‌మైన ఆరోప‌ణ‌లు చేసిన‌ట్లు తాను మీడియా ద్వారా తెలుసుకున్నాన‌ని పేర్కొన్నారు. ఈ సుకేష్ చంద్ర‌శేఖ‌ర్ అనే పోకిరీ గురించి ఎన్న‌డూ వినలేద‌న్నారు. ప‌దే ప‌దే అర్థం ప‌ర్థం లేని మాట‌ల‌తో ఎవ‌రిని ప‌డితే వారిపై కీల‌క నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం అల‌వాటుగా చేసుకున్నాడ‌ని అన్నారు. సుకేష్ చంద్ర‌శేఖర్ ఎవ‌రో, అత‌డి నేర చ‌రిత్ర ఏమిటో అందరికీ తెలుసునని. త‌న‌పై నిరాధార విమ‌ర్శ‌లు చేసిన‌ప్పుడు మీడియా కూడా త‌న ప‌రిమితులు ఏమిటో తెలుసుకుని ప్ర‌చురించాల‌ని సూచించారు.  

Tags:    

Similar News