ఆ జిల్లాలో స్కూల్స్‌కు నేడు సెలవు

యాదాద్రి జిల్లాలో నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు

Update: 2023-03-01 07:54 GMT

యాదాద్రి జిల్లాలో నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. యాదాద్రి జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రమేలా సత్పతి తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని ఉతర్తులు జారీ చేశారు.

బ్రహ్మోత్సవాలకు...
జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు ఈరోజు సెలవు ప్రకటించాలని కలెక్టర్ కోరారు. బ్రహ్మోత్సవాలు హాజరయ్యేందుకు వీలుగా ఈ సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించిన తర్వాత తొలి సారి జరుగుతున్న బ్రహ్మోత్సవాలు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.


Tags:    

Similar News