App: ఇక ఫేక్‌ ఐడీలకు చెక్‌.. సరికొత్త యాప్‌ను సృష్టించిన తెలంగాణ వాసి

ఈ రోజుల్లో సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకుల నుంచి అంటూ ఫోన్‌లు చేస్తూ ప్రజలను నిలువునా

Update: 2024-01-05 08:07 GMT

Fake Websites Identify

App:ఈ రోజుల్లో సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకుల నుంచి అంటూ ఫోన్‌లు చేస్తూ ప్రజలను నిలువునా దోపిడి చేస్తున్నారు. ఫోన్‌ కాల్స్‌ కాకుండా లింక్‌లను పంపుతూ కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేందుకు ఓ యువకుడు చేసిన ప్రయత్నానికి అందరు ఫిదా అవుతున్నారు. సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. అదే మొబైల్‌ యాప్‌. భద్రాద్రి కొత్తగూడెం (Kottagudem)కు చెందిన కడియాల గోపి అనే యువకుడు 'వెరిఫైయూఆర్‌ఎల్‌' (verify URL) అనే యాప్‌ను రూపొందించాడు. ఆరు వేలకుపైగా అధికారిక అఫీషియల్ వెబ్‌సైట్‌ అడ్రస్‌ల జాబితా తయారు చేశాడు గోపి. ప్రభుత్వ అనుమతి పొందిన ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులు, ప్రముఖ షాపింగ్‌ మాల్స్‌, ఇతర కంపెనీల వైబ్‌పైట్లు ఇందులో ఉన్నాయి. వీటి ఆధారంగా మొబైల్‌కు వచ్చే వెబ్‌ సైట్‌ (Website) అడ్రస్‌లను ఈ యాప్‌ ద్వారా చెక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ యాప్‌ను వాడిన ఎందరో గోపిని అభినందిస్తున్నారు.

యాప్‌ తయారు చేయడానికి కారణం ఏంటి?

ఈ యాప్‌ను తయారు చేయడానికి కారణం కూడా ఉందంటున్నాడు గోపి. ఆన్‌లైన్‌ మోసాల బారిన పడిన ఇతను.. 2010లో కొత్తగూడెం మైనింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదివాడు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో జాబ్‌ చేస్తున్నాడు. ఫైనల్‌ ఇయర్‌లో ఉండగా అతనికి ఓ మెయిల్‌ వచ్చింది. మెయిల్‌కు కోటి రూపాయల లాటరీ తగిలిందని, మీరు రూ.25 వేలు చెల్లిస్తే డబ్బులు మీ ఖాతాలో పడుతాయి అటూ వచ్చిన మెసేజ్‌కు గోపి స్పందించాడు. మెయిల్‌ పంపిన వ్యక్తి బ్యాంకు ఖాతా (Bank Account) నంబర్‌ తో పాటు ఫోన్‌ నంబర్‌ కూడా ఇవ్వగా రూ.కోటి వస్తాయనే భావనతో గోపి రూ.25 వేలు ఖాతాలో జమ చేశాడు. ఆ తర్వాత సదరు వ్యక్తికి ఫోన్‌ చేస్తే డబ్బు తీసుకునేందుకు ముంబై రావాలని సూచించాడు. గోపీ ఆ తర్వాత పలుమార్లు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. తీరా చూస్తే తాను మోసపోయానని గమనించాడు. అయితే తనలాగా ఎవ్వరు కూడా మోసపోవద్దనే ఉద్దేశంతో ఈ ' వ ఎరిఫై యూఆర్‌ఎల్‌ అనే యాప్‌ను తీసుకువచ్చినట్లు చెబుతున్నాడు.

అయితే మన మొబైల్స్‌కు, ఇమెయిల్స్‌కు ఆఫర్ల పేరుతో చాలా రకాల మెసేజ్‌లతో కూడి లింకులు వస్తుంటాయి. ఆ లింకులను క్లిక్‌ చేస్తే ఇక అంతే సంగతి. వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకు వివరాలన్ని వారి చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఇంకే ముంది తర్వాత బ్యాంకు అకౌంట్‌ మొత్తం ఖాళీ అవుతుంది. అయితే మన ఫోన్‌కు వచ్చిన కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ నిజమైనదా..? నకిలీదా? తెలుసుకునేందుకు గోపీ రూపొందించిన ఈ 'వెరిఫై యూఆర్‌ఎల్‌' యాప్‌ ఉపయోగపడుతోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి పొంది దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులే కాక ప్రముఖ షాపింగ్‌ మాల్స్‌, పలు రాష్ట్రాల అధికార వైబ్‌సైట్లు 6 వేలకుపైగా అడ్రస్లు, ఐడీలను యాప్‌లో నిక్షిప్తం చేశాడు. మొబైల్‌ ప్లేస్టోర్‌కు వెళ్లి ‘వెరిఫైయూఆర్‌ఎల్‌’ యాప్‌ డౌన్‌∙లోడ్‌ చేసుకుని. అందులో మన మొబైల్‌కు వచ్చిన వెబ్‌సైట్‌ ఐడీని పేస్ట్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం సెర్చ్‌ కొడితే ఈ యాప్‌ లో సెర్చ్‌ చేస్తే ఆ వైబ్‌పైట్‌ కంపెనీ నుంచి అధికారికంగా వచ్చిందా.. లేదా అనేది తెలిసిపోతుంది.

Tags:    

Similar News