ట్రాఫిక్ చలాన్.. ఇకపై వాట్సాప్ లో చెక్ చేసుకోండి
వాహనదారులు డ్రైవింగ్ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు విధించిన జరిమానాల గురించి తెలియజేసేందుకు
హైదరాబాద్ : ట్రాఫిక్ చలాన్ కు సంబంధించి కొత్త నిర్ణయం తీసుకుంది రవాణా శాఖ. ఇకపై ట్రాఫిక్ చలానాలు మీ WhatsApp లో కూడా చూసుకోవచ్చు. వాహనదారులు డ్రైవింగ్ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు విధించిన జరిమానాల గురించి తెలియజేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాట్సాప్ లో కూడా అప్డేట్స్ ఇవ్వనున్నారు. ట్రాఫిక్ పోలీస్‌లోని ఇ-చలాన్ విభాగంలోని పోలీసుల బృందం ప్రతి వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌కు ట్రాఫిక్ పోలీసు ఇ-చలాన్ పోర్టల్‌లో ట్రాఫిక్ జరిమానాలను అప్‌డేట్ చేస్తుంది. దాని తర్వాత వాహన యజమాని మొబైల్ ఫోన్‌కు ముందుగా మెసేజ్ పంపి, తర్వాత పోస్టల్ చలాన్ కూడా పంపబడుతుంది. ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా చలానాను పంపనున్నారు. ఇక ఆన్‌లైన్‌లో లేదా ట్రాఫిక్ కాంపౌండింగ్ బూత్ లేదా మీసేవలో పెండింగ్ చలాన్‌ను చెల్లించాల్సి ఉంటుంది. వాహన యజమానులందరికీ ఇమెయిల్ ఖాతాలు లేకపోవడంతో వాటిలో పంపించడం కాస్త కష్టమవనుంది.