హైకోర్టుకు హాజరయిన హైడ్రా కమిషనర్
హైడ్రా కమిషనర్ రంగనాధ్ ఈరోజు హైకోర్టుకు హాజరయ్యారు.
హైడ్రా కమిషనర్ రంగనాధ్ ఈరోజు హైకోర్టుకు హాజరయ్యారు. కోర్టు కేసులో ఉన్న భవనాలను ఎలా కూలుస్తారన్న దానిపై విచారణకు ఆయనను పిలిపించింది. ఆయనను న్యాయమూర్తి అనేక రకమైన ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలిసింది. హైడ్రా ఏర్పాటు ఉద్దేశ్యం మంచిదే అయినా కూల్చివేతల విషయంలో లబ్దిదారులకు అవకాశం ఇవ్వరా? అని ప్రశ్నించారు.
ఆదివారాల్లో మాత్రమే...
కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే కూల్చివేతలకు కారణమేంటని కూడా న్యాయమూర్తి హైడ్రా కమిషనర్ ను ప్రశ్నించినట్లు తెలిసింది. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులకు ఎఫ్.డి.ఎల్ ఫిక్స్ చేశారా? అని కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. పరివాహక ప్రాంతాలు ఎక్కడ అన్నది నిర్ధారణ కాకుండా ఎలా కూల్చివేస్తారని కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రధానంగా అమీన్ పూర్ భవనం కూల్చిపేత పై న్యాయమూర్తి ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది