Allu Arjun : గాంధీ ఆసుపత్రికి అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు

Update: 2024-12-13 08:55 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అల్లు అర్జున్ వార్త దావానంలా వ్యాపించడంతో ఆయన అభిమానులు అధికసంఖ్యలో చిక్కపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.అభిమానులు ఎవరూ ఇక్కడకు రావద్దంటూ పోలీసులు తెలిపారు.

వైద్యపరీక్షలు జరిపిన
చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రి లో పల్స్ రేటు, బీపీవంటివి చెక్ చేసిన తర్వాత న్యాయస్థానంలో అల్లు అర్జున్ ను ప్రవేశపెట్టే అవకాశముంది. న్యాయస్థానానికి ఇప్పటికే అల్లు అర్జున్ తరుపున న్యాయవాదులు చేరుకున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారణ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ కు బెయిల్ వస్తుందా? లేదా? అన్నది తేలనుంది.


Tags:    

Similar News