Allu Arjun : నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను నాంపల్లి కోర్టుకు తరలించారు. గాంధీ ఆసుపత్రి బయట ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో చి చేరుకున్నారు. కానీ పోలీసుల భారీ బందోబస్తు మధ్య అల్లు అర్జున్ ను నాంపల్లి కార్టుకు తరలించారు.
భారీ బందోబస్తు మధ్య...
నాంపల్లి కోర్టు వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అభిమానులు ఎవరూ అక్కడకు చేరకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మరికాసేపట్లో అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరి న్యాయమూర్తి ఏ రకమైన తీర్పు చెబుతారన్నది ఉత్కంఠగా మారింది. సాయంత్రం నాలుగుగంటలకు ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటీషన్ విచారణకు రానుంది.