హెవీ రెస్పాన్స్.. మూడురోజుల్లో 39 కోట్లు
తెలంగాణలో వాహనాల చలాన్లకు మంచి స్పందన కన్పిస్తుంది. రాయితీలు ప్రకటించడంతో వాహనదారులు చలాన్లను చెల్లిస్తున్నారు.
తెలంగాణలో వాహనాల చలాన్లకు మంచి స్పందన కన్పిస్తుంది. రాయితీలు ప్రకటించడంతో వాహనదారులు చలాన్లను చెల్లిస్తున్నారు. త్వరగా చెల్లించి తమ వాహనాలను పెనాల్టీ నుంచి బయటపడేయాలని భావిస్తుండటంతో ఈ కార్యక్రమానికి పెద్ద యెత్తున స్పందన కన్పిస్తుంది. మీ సేవ, ఈ సేవతో పాటు వెబ్ సైట్ లో లాగిన్ అయి వాహనదారులు తమ పెనాల్టీలను చెల్లిస్తుండటం విశేషం.
ఈ నెల 31వ తేదీ వరకూ....
మార్చి 1వ తేదీ నుంచి ఈ కార్యక్రమం హైదరాబాద్ పరిధిలో ప్రారంభమయింది. తొలి మూడు రోజుల్లోనే 39 కోట్ల రూపాయలు పెనాల్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఈ నెల 31వ తేదీ వరకూ చలానాల చెల్లింపునకు గడువు ఉంది. దాదాపు 600 కోట్ల రూపాయలు చలాన్ల రూపంలో రావాల్సి ఉండగా ద్విచక్ర వాహనాలకు 75 శాతం, కార్లు, హెవీ వాహనాలకు 50 శాతం రాయితీని ప్రకటించారు.