రేపు, ఎల్లుండి వడగాలుల తీవ్రత.. ఆరెంజ్ అలెర్ట్
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగింది. ఉదయం పది గంటలు దాటితే ప్రజలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగింది. ఉదయం పది గంటలు దాటితే ప్రజలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు. మార్చి నెలలోనే ఎండలు దంచేశాయి. ఏప్రిల్ నెలలోకి ఎంటర్ అయ్యాం. ఇక ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనన్న ఆందోళన సర్వత్రా వ్కక్తమవుతుంది. ఇప్పటికే ప్రతి రోజూ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావారణ శాఖ అధికారులు చెబుతున్నారు.
బయటకు రాకుండా.....
ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రేపు, ఎల్లుండి తెలంగాణలో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు సాధ్యమయినంత వరకూ బయటకు రాకుండా ఉంటేనే మంచిదని, వడదెబ్బ తగిలే అవకాశముందని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.