తెలంగాణలో ఫీవర్ సర్వేలో షాకింగ్ న్యూస్
తెలంగాణలో ఫీవర్ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిన్న తెలంగాణలో ఫీవర్ సర్వే ప్రారంభమయింది.
తెలంగాణలో ఫీవర్ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిన్న తెలంగాణలో ఫీవర్ సర్వే ప్రారంభమయింది. తొలి రోజు యాభై వేల మందికి పైగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లు సర్వేలో వెల్లడయింది. ఎక్కువ మంది జలులు, జ్వరంతో బాధపడుతున్నట్లు సర్వేలో తేలింది. దీంతో వారికి వైద్య ఆరోగ్య సిబ్బంది మెడికల్ కిట్లను అందజేస్తున్నారు.
జ్వరం, దగ్గులతో.....
కరోనా కేసులు తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం ఫీవర్ సర్వేను ప్రారంభించింది. నాలుగైదు రోజుల్లో సర్వే పూర్తి కావాలని అధికారులు ఆదేశించారు. ఈరోజు కూడా తెలంగాణలో ఫీవర్ సర్వే కొనసాగనుంది. ఫీవర్ సర్వే ప్రకారం ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచడం, మెడికల్ కిట్లను మరిన్ని సిద్దం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.