కవిత బెయిల్ కేసు వాయిదా
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటీషన్ విచారణ జరిగింది. విచారణను ఈ నెల 4వ తేదీకి వాయిదా వేసింది
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటీషన్ విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈ నెల 4వ తేదీకి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న కవిత తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. నేడు బెయిల్ పిటీషన్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.
ఈ నెల 4న...
కవిత తరుపున న్యాయవాదుల వాదనను విన్న న్యాయస్థానం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వివరణ కోరింది. అందుకు తగిన సమయం కావాలని ఆయన కోరడంతో విచారణను ఈ నెల 4వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఉన్నారు. ఆమె తన కుమారులకు పరీక్షలున్నాయని కాబట్టి తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ పిటీషన్ వేశారు.