Telangana : తెలంగాణలో భారీ వర్షం.. వడగళ్ల వాన కురియడంతో

తెలంగాణలో అనేక జిల్లాల్లో వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది

Update: 2024-04-19 12:29 GMT

తెలంగాణలో అనేక జిల్లాల్లో వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మండుతున్న ఎండల్లో ప్రజలకు కాసింత ఉపశమనం కలిగేలా వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లాలోని అనేక మండలాలల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి, ఇందల్వాాయి. ధర్పల్లి, సిరికొండలలో వర్షం కురిసింది. దీంతో అక్కడ ప్రజలు ఎండ వేడిమి నుంచి కొంత ఊరట చెందారు.

పంటలకు నష్టం...
ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో కొన్ని చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వడగండ్ల వాన కూడా కురవడంతో అనేక చోట్ల పంటలు దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు. ఈదురుగాలులు, వడగండ్లు పడటంతో పంటలు దెబ్బతిన్నాయని కామారెడ్డి జిల్లాలో రమారెడ్డి, మాచారెడ్డి మండలాల్లో భారీ వర్షం నమోదయింది.


Tags:    

Similar News