నేడు కొండగట్టుకు పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు.

Update: 2023-01-24 03:02 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. తాను ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్న వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం నాచుపల్లిలోని ఒక రిసార్టులో తెలంగాణ జనసేన నేతలో పవన్ కల్యాణ్ సమావేశమవుతారు.

నారసింహయాత్రకు....
అనంతరం ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని పవన్ కల్యాణ్ దర్శించుకుంటారు. ధర్మపురిలోని నరసింహస్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి పవన్ కల్యాణ్ అనుష్టువ్ నారసింహ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. మొత్తం 31 నారసింహ క్షేత్రాలను పవన్ కల్యాణ్ ఈ యాత్రలో దర్శించుకున్నారు. పవన్ పర్యటన సందర్భంగా కొండగట్టులో, ధర్మపురిలో ప్రత్యేక బందోబస్తును ఏరపాటు చేశారు.


Tags:    

Similar News