Kalvakuntla Kavitha : నేడు కవిత బెయిల్ పై తీర్పు

నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పు వెలువడనుంది

Update: 2024-04-08 02:03 GMT

నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పు వెలువడనుంది. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న కవిత పిటీషన్ విచారణ చేసిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, బెయిల్ ఇవ్వవద్దని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల తరుపున న్యాయవాదులు వాదించారు.

మార్చి 15న అరెస్టయి...
అదే సమయంలో తన కుమారుడికి పరీక్షలున్నాయని, తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత తరుపున న్యాయవాదులు వాదించారు. గత నెల 15వ తేదీన ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఈరోజు తీర్పు కవితకు అనుకూలంగా వస్తుందా? రాదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.


Tags:    

Similar News