Congress : ప్రారంభమైన కీలక భేటీ.. సాయంత్రానికి క్లారిటీ
సీఎల్పీ నేత ఎవరన్నది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు
సీఎల్పీ నేత ఎవరన్నది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి డీకే శివకుమార్ తో పాటు కేసీ వేణుగోపాల్ వచ్చారు. ఈరోజు ముఖ్యమంత్రి ఎవరన్నది హైకమాండ్ తేల్చనుందని డీకే శివకుమార్ తెలిపారు. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతనే నిర్ణయం వెలువడుతుందన్నారు. కొద్దిసేపటి క్రితం ఖర్గే నివాసంలో సమావేశం ప్రారంభమయింది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు.
విడివిడిగా భేటీ అయి...
అంతకు ముందు డీకే శివకుమార్ మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. పరిస్థితిపై చర్చించారు. అలాగే మల్లు భట్టి విక్రమార్కతో కూడా విడిగా సమావేశమై ఆయన అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలతో పాటు కీలక నేతల మనోభావాలను కూడా ఖర్గే ముందు ఉంచనున్నారు. సాయంత్రానికి సీఎం ఎవరన్నది తేలనుంది.