పట్నం కస్టడీపై నేడు విచారణ
పట్నం నరేందర్ కస్టడీపై నేడు కొడంగల్ కోర్టు విచారణ చేపట్టనుంది. లగచర్ల ఘటనలో పట్నం ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు;

పట్నం నరేందర్ కస్టడీపై నేడు కొడంగల్ కోర్టు విచారణ చేపట్టనుంది. లగచర్ల ఘటనలో పట్నం ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాస్‌వర్డ్ చెప్పేందుకు పట్నం నరేందర్ రెడ్డి నిరాకరించారు. అయితే ఇప్పటికే పోలీసులు కాల్ డేటాను న్యాయస్థానానికి సమర్పించారు. పట్నం నరేందర్‌రెడ్డిని కస్టడీకి అనుమతిస్తే..ఫోన్ డేటా విశ్లేషిస్తామంటున్న పోలీసులు చెబుతున్నారు.
కోర్టు తీర్పుపై...
ఈ నేపథ్యంలో ఈరోజు కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి సమర్పిస్తారా? లేదా? అన్నది నేడు తేలనుంది. మరోవైపు లగచర్ల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడంతో గత కొద్ది రోజుల నుంచి పట్నం నరేందర్ రెడ్డి జైలులోనే ఉన్నారు. ఆయన హైకోర్టులో వేసిన క్వాష్ పిటీషన్ ను కూడా కొట్టివేయడంతో కొడంగల్ కోర్టు తీర్పుపైనే ఆయన కు ఊరట లభిస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.