Breaking: మాణికం ఠాగూర్ లెఫ్ట్

మాణికం ఠాగూర్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన మల్లికార్జునఖర్గేకు లేఖ రాశారు

Update: 2023-01-04 12:43 GMT

మాణికం ఠాగూర్ ను రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన ఏఐసీపీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేకు లేఖ రాశారు. ఆయన స్థానంలో త్వరలో కొత్త ఇన్‌ఛార్జిని నియమించనున్నారు. మాణికం ఠాగూర్ తెలంగాణ కాంగ్రెస్ లోని అన్ని వాట్సాప్ గ్రూపుల నుంచి లెఫ్ట్ అయ్యారు. అందరికీ ధన్యవాదాలు అంటూ ఆఖరి ట్వీట్ ను మాణికం ఠాగూర్ చేశారు. ఆ తర్వాత అన్ని వాట్సప్ గ్రూపుల నుంచి ఆయన లెఫ్ట్ అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ ఇటీవల దిగ్విజయ్ సింగ్ కు మాణికం ఠాగూర్ పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

మాణికంను మార్చాలని...
మాణికంను మార్చాలని దిగ్విజయ్ కూడా అధిష్టానానికి నివేదిక ఇచ్చారన్న ప్రచారం జరుగుతుంది. త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్‌ఛార్జి వస్తున్నారంటూ ఢిల్లీ స్థాయిలో ప్రచారం జరుగుతున్న సమయంలో మాణికం ఠాగూర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. దీంతో పాటు ఆయన వాట్సప్ గ్రూప్ ల నుంచి తప్పుకోవడం కూడా ఇందుకు ఊతమిస్తుంది. కొత్త ఇన్‌ఛార్జి వస్తున్నాడంటూ ఇప్పుడు ప్రచారం ఊపందుకుంది. తనను తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి నుంచి తప్పించాలంటూ మాణికం ఠాగూర్ లేఖ కూడా ఇచ్చారని తెలిసింది.


Tags:    

Similar News