Medak Church : మెదక్ చర్చికి వందేళ్లు.. శత జయంతి వేడుకులకు సిద్ధం

మెదక్ చర్చి ప్రసిద్ధి గాంచింది. శత జయంతి వేడుకలను జరుపుకుంటోంది

Update: 2024-12-23 05:40 GMT

మెదక్ జిల్లా చర్చి ప్రసిద్ధి గాంచింది. కేవలం తెలంగాణ మాత్రమే కాదు ప్రపంచం నలుమూలల నుంచి మెదక్ చర్చికి వచ్చి ఒక్కసారి దర్శించుకుంటే చాలని భావిస్తారు. మెదక్ చర్చిలో ఒక్కసారి అయినా ప్రార్థనలు చేయాలని ప్రతి క్రైస్తవ సోదరుడు పరితపిస్తారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ చర్చిని మన జాతి సంపదగా పరిరక్షించుకుంటూ వస్తున్నారు. కులాలు, మతాలకు అతీతంగా మెదక్ చర్చిని సందర్శించే వారి సంఖ్య నిత్యం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మెదక్ లో అడుగు పెట్టిన వెంటనే మనకు గుర్తుకు వచ్చేది చర్చి మాత్రమే. ఆ తర్వాతే ఇంకేదైనా.. మెదక్ కు బ్రాండ్ గా చర్చి నిలుస్తుందనడలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ చర్చి వల్లనే మెదక్ కు అంతటి ప్రాముఖ్యత లభించింది.

చర్చినిర్మాణం జరిగి...

మెదక్ చర్చి నిర్మాణ పనులు 1914లో ప్రారంభమయ్యాయి. అప్పటి క్రైస్తవ మత బోధకుడు చార్లెస్ వాకర్ పాస్నెట్ చర్చిని నిర్మించాలని తలపెట్టారు. నాటి నిజా రాజు చర్చి నిర్మాణం కోసం భూమిని కేటాయించారు. 120 ఎకరాల విస్తీర్ణంలో చర్చి ఉంటుంది. కరువు నుంచి నాడు కాపాడటానికి, ప్రజలను కరువు బారి నుంచి బయటపడేసేందుకు ఈ చర్చినినిర్మించారని చెబుతారు. వందలాది మంది కూలీలు ఈ చర్చి నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ఈ చర్చి నిర్మాణానికిపదేళ్ల సమయం పట్టిందంటే ఎంత సుందరంగా, ఎంత పకడ్బందీగా నిర్మించారో ఇక చెప్పకనే చెప్పొచ్చు. జీవితంలో ఒక్కసారైనా మెదక్ చర్చిని సందర్శించాలన్న కోరిక ప్రతి ఒక్కరికి కలిగేలా ఈ నిర్మాణం జరిగింది. రెండు వందల అడుగుల పొడుగు, వంద అడుగు వెడల్పుతో ఈ మెదక్ చర్చిని నిర్మించారు. దేశంలోనే అతి పెద్ద చర్చిల్లో మెదక్ చర్చిరెండోదిగా ప్రసిద్ధి గాంచింది. మెదక్ చర్చి వున్న టవర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ టవర్ పొడవు 170 అడుగులు. అయితే నాడు మెదక్ చర్చి నిర్మాణంలో ఎటువంటి సిమెంట్ ను వినియోగించలేదు. కేవలం సున్నపురాయితోనే నిర్మించినా ఇప్పటికీ మెదక్ చర్చి పటిష్టంగా ఉంది.

సూర్యకిరణాలను ప్రవేశించి...
మెదక్ చర్చిలో ఏసు క్రీస్తును శిలువవేసిన దృశ్యం చూసి కంటతడి పెట్టిస్తుంది. చర్చిలోకి సూర్య కిరణాలు ప్రవేశించిన తర్వాతమాత్రమే ఈ చిత్రాలు కనిపించడంఈ చర్చిలోని దృశ్యాల ప్రత్యేకతగా చెప్పాలి. మెదక్ క్యాథడ్రిల్ చర్చి నిర్మాణం వందేళ్లు పూర్తయన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ నెల 25వ తేదీన క్రిస్మస్ వేడుకలకు లక్షల సంఖ్యలో మెదక్ చర్చికి హాజరయ్యే అవకాశముంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు చేస్తున్నారు. దక్షిణ భారత దేశంలోని అనేక మంది పీఠాధిపతులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. విదేశాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు. సో.. మెదక్ చర్చిని ఒక్కసారి చూసి తరించేద్దాం.. పదండి.



ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

 

Full View


Tags:    

Similar News