Telangana : తెలంగాణలో వర్షాలు ఎప్పటి వరకూ అంటే?
ఫెంగల్ తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది
ఫెంగల్ తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఫెంగల్ తుపాను బలహీన పడి అల్పపీడనంగా మారినప్పటికీ దాని ప్రభావంతో వర్షాలు తెలంగాణలోనూ పడే అవకాశముందని తెలిపింది. అల్పపీడనం ఈరోజు అరేబియన్ సముద్రంలో ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
తుపాను ప్రభావంతో...
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను బలహీనపడినప్పటికీ దాని ప్రభావంతో మరో ఐదు రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. అయితే చలి తీవ్రత కొంత వరకూ తగ్గింది. ఉదయం పూట మాత్రం పొగమంచు కమ్మేస్తుంది. దీంతో జాతీయ రహదారులపై ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.