రానున్నది "మండే" కాలమే.. అలెర్ట్
ఏప్రిల్ రెండో వారంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
ఏప్రిల్ రెండో వారంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించింది. ఈ ఏడాది మార్చి నుంచే ఎండలు మండి పోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో వడదెబ్బ మరణాలు కూడా సంభవించాయి. ఎన్నడూ లేనిది మార్చి నెలలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడాన్ని వాతావరణ శాఖ ఉదహరించింది.
వారం రోజుల్లో....
రానున్న వారం రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించింది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేక చోట్ల దాటే అవకాశముందని చెప్పింది. ఎండలతో పాటు వడగాలులు, ఉక్కపోత కూడా ఉంటుందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని, వచ్చినా ఎండనుంచి రక్షణ దొరికే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.