24 అవర్స్.. రెయిన్ అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Update: 2022-08-08 08:20 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో వర్షాలు కురిసే అవకాశముందని తెలిసింది. ఈ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని చెప్పింది. ఈ ప్రభావంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఉత్తరకోస్తా.. కోస్తాంధ్ర...
24 గంటల్లో తెలంగాణలోని ఉత్తర కోస్తా జిల్లాలు, కోస్తాంధ్రలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. అదే సమయంలో ఈ నెల 9,10 తేదీల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


Tags:    

Similar News