200 కార్లు.. 2000 మోటార్ సైకిళ్లు.. హరీశ్ ధ్వజం

మునుగోడు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి హరీశ్ రావు మండి పడ్డారు.

Update: 2022-10-09 08:02 GMT

మునుగోడు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి హరీశ్ రావు మండి పడ్డారు. 200 కార్లు, రెండు వేల మోటారు సైకిళ్లు వివిధ ఏజెన్సీలలో బుక్ చేసినట్లు టీఆర్ఎస్ నేతలకు సమాచారం తెలిసిందన్నారు. తాము కూడా కార్యకర్తలతో మండలాల వారీగా నిఘా ఏర్పాటు చేసుకున్నామన్నారు. దీనిపై ఎక్కడక్కడ పంపిణీ చేస్తున్నారో తెలుసుకుని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కోట్ల రూపాయలు వెచ్చించి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా తమ కంపెనీకి 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు దక్కిందని చెప్పారన్నారు.

విచ్చలవిడిగా...
మునుగోడు ప్రజలు ఆలోచించాలని, మోటార్లు ఇచ్చి బావులు కాడ మోటార్లు పెడతారని హరీశ్ రావు అన్నారు. ఇది మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి పరీక్ష అని ఆయన అన్నారు. రాజగోపాల్ రెడ్డి విచ్చలవిడిగా ధనం ఖర్చు పెడుతున్నారని తెలిపారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలను కొనాలని చూస్తున్నారన్నారు. మోటార్లు కావాలా? మీటర్లు కావాలా? అని అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఓట్లేస్తారని భావించి ఈ చర్యలకు దిగుతున్నారన్నారు. బీజేపీ అధికారాన్ని అడ్డం పెట్టుకని దొడ్డిదారిన గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు.


Tags:    

Similar News