బీఆర్ఎస్ మూతపడటం ఖాయం : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
జూన్ తర్వాత బీఆర్ఎస్ మూతపడటం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు
జూన్ తర్వాత బీఆర్ఎస్ మూతపడటం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయడం గ్యారంటీ అని ఆయన అన్నారు. జూన్ 5వ తేదీ తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు నేతల వెంటపడి కొడతారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
పదేళ్లు దోచుకుని...
కేసీఆర్ పదేళ్ల పాటు అధికారంలో ఉండి రాష్ట్ర సంపదనంతా దోచుకున్నారని, అది చాలక కేసీఆర్ కుటుంబం ఢిల్లీకి వెళ్లిందని ఎద్దేవా చేశారు. ఎలాంటి అవినీతి చేయకుండానే కల్వకుంట్ల కవితపై ఎనిమిది పేజీల ఛార్జిషీట్ ను దాఖలు చేశారా? అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి ఖజానాలో పైసా లేదని, ఇందుకు కారణం బీఆర్ఎస్ కాదా? అని ఆయన ప్రశ్నించారు.