నా మీద కూడా దాడి చేస్తారు : మల్లారెడ్డి
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని మంత్రి మల్లారెడ్డి ఖండించారు
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని మంత్రి మల్లారెడ్డి ఖండించారు. తనపై కూడా దాడి జరిగే అవకాశాలున్నాయన్నారు. తనను కొద్ది రోజులుగా కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ రౌడీలకు, గూండాలకు టిక్కెట్లు ఇచ్చి ఎన్నికల్లో పోటీకి నిలుపుతుందని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్యయుతంగా...
ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న మంత్రి మల్లారెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి హింసకు పాల్పడుతున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. ఇలాంటి హింసా రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్య యుతంగా అధికారంలోకి రాలేక కాంగ్రెస్ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారని ఆయన ఆరోపించారు.