తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన పొంగులేటి
భూమి ఉన్న వారందరికీ రైతు బంధు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు;
భూమి ఉన్న వారందరికీ రైతు బంధు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు బంధు, ఇందిరమ్మఇళ్లపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖిండించారు. ఎవరూ అభద్రతకు లోను కావద్దని, అర్హులైన వారందరీకీ రైతు భరోసా నిధులు మంజూరు చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డితెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లను...
ఇక ఇందిరమ్మ ఇళ్లను కూడా అందరికీ ఇస్తామనిచెప్పారు. రియల్ ఎస్టేట్ భూములకు మాత్రమే రైతు బంధు ఉండదని, మిగిలిన అందరికీ ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. కేటీఆర్ తనపై నమోదయిన కేసు లొట్టపిట్ట కేసు అని అంటున్నారని, అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈడీ ఎందుకు ఈ కేసును విచారిస్తుందని పొంగులేటి ప్రశ్నించారు. కేటీఆర్ మాటల్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.