ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా

తెలంగాణ ఇంటర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు

Update: 2022-06-28 05:53 GMT

తెలంగాణ ఇంటర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఇంటర్మీడియట్ మొదటగి సంవత్సంలో 63.32 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ లో 67.16 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్ ఇంటర్మీడియట్ లో మేడ్చల్ జిల్లా ప్రధమ స్థానంలో నిలవగా, హన్మకొండ ద్వితీయస్థానంలో నిలిచింది. ఇంటర్మీడియట్ పరీక్షలకు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని మంత్రి సబిత తెలిపారు.

ఆగస్టు 1 నుంచి...
ఇక బాలురలో ఫస్ట్ ఇయర్ 54.25 శాతం మంది, సెకండ్ ఇయర్ లో 59.21 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్, సెకండ్ ఇయర్ లలో బాలికలే ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించారు. ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని మంత్రి సబిత తెలిపారు. ఫలితాలను చూసుకోవాలంటే https://tsbie.cog.gov.in తో పాటు https://results.cgg.gov.in, https://examresults.nic.in వంటి వెబ్ సైట్లలో పదకొండు గంటల తర్వాత చూసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News