వెనక్కు తగ్గిన కోమటిరెడ్డి
ఎన్టీఆర్ ఘాట్ తొలగించి అసెంబ్లీని నిర్మించాలని తాను అనలేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు;
ఎన్టీఆర్ ఘాట్ తొలగించి అసెంబ్లీని నిర్మించాలని తాను అనలేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తన మాటలను వక్రీకరించారని తెలిపారు. ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో అభిమానం, గౌరవం ఉందన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను అనని మాటలను కొందరు కావాలని వక్రీకరించారని అన్నారు. ఈ విషయాలను ఎవరూ నమ్మవద్దని సూచించారు.
తాను అలా అనలేదు...
ఈ రకంగా రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ కొత్తది కడితే బాగుంటుందని మాత్రమే తాను అన్నాపపి. సెక్రటేరియట్ పక్కన అసెంబ్లీ కడితే బాగుంటుందని అన్నానని చెప్పారు. ఎన్టీఆర్ ఒక లెజెండరీ పర్సనాలిటీ అని పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now