ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన ప్రమాదం
తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు ఎప్పుడు ఏమి జరుగుతుందా అనే టెన్షన్
తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు ఎప్పుడు ఏమి జరుగుతుందా అనే టెన్షన్ లో బతుకుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అనేక గ్రామాలు వరదల్లో ఉండిపోవడంతో.. వరద బాధితుల సహాయం కోసం అధికారులు, ఆర్మీ ఎన్డీఆర్ ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. వరద బాధితులకు అండగా ప్రజా ప్రతినిధులు వెళుతూ ఉన్నారు. బాధితగ్రామాల్లోని ప్రజల దగ్గరకు బోట్ల లో వెళ్లి పరామర్శిస్తున్నారు. వరద ముంపు ప్రాంతంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే సీతక్కకు ప్రమాదం తప్పింది. ముంపు ప్రాంతాల్లో నిత్య అవసర సరుకులు పంపిణీని ఎమ్మెల్యే సీతక్క చేపట్టగా.. వాగులో పడవ పై ప్రయాణిస్తున్న సమయంలో పడవలో పెట్రోల్ అయిపొయింది. దీంతో ఆ పడవ ఓ చెట్టుకు ఢీ కొని ఆగిపోయింది. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపెల్లిలో వరద ప్రాంతంలో చోటు చేసుకుంది.