జైలుకు వెళ్లడానికైనా సిద్ధం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తాను జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమేనని ఆమె తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఢిిల్లీ లిక్కర్ స్కాంపై స్పందించారు. బీజేపీ నీచ రాజకీయాలకు ఇది ఒక ఎత్తుగడ అని ఆమె తెలిపారు. తెలంగాణలో వచ్చే డిసెంబరు నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోడీ కంటే ముదు ఈడీ రావడం సహజమని ఆమె అభిప్రాయపడ్డారు.
సమాధానం చెబుతాం...
బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్లలో తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారని ఆమె మండి పడ్డారు. ఎన్నికలకు ముందు ఈడీ సోదాలు చేయడం సహజమని కవి అన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తారని ముందుగానే ఊహించామని, అయితే దేనికీ భయపడేది లేదని కవిత తెలిపారు. ఈడీ తనను పిలిచి ప్రశ్నిస్తే సమాధానం చెబుతానని ఆమె చెప్పారు. జైల్లో పెట్టడం కంటే చేసేదేమీ లేదని, ఇప్పటికైనా పంధాను మార్చుకోవాలని మోదీకి కవిత సూచించారు.