సిరాజ్ కు భారీ గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం

భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Update: 2024-07-09 13:27 GMT

భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళాడు. ఈ సందర్భంగా 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకునేందుకు సహకారం అందించినందుకు సిరాజ్‌ను సీఎం అభినందించారు. ముంబైలో జరిగిన టీమ్ ఇండియా విజయోత్సవ పరేడ్ తర్వాత సిరాజ్ హైదరాబాద్ రాక సందర్భంగావిజయోత్సవ వేడుకలను నిర్వహించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారతదేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు తెచ్చిన ఆల్‌రౌండ్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. సిరాజ్‌ను మర్యాదపూర్వకంగా సత్కరించారు. సిరాజ్‌కు హైదరాబాద్‌లో ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని.. హైదరాబాద్‌ పరిసరాల్లో స్థలం గుర్తించాలని అధికారులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

"అంతర్జాతీయ క్రికెట్‌లో భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిన అల్ రౌండ్ క్రికెటర్ @mdsirajofficial గారిని ముఖ్యమంత్రి @revanth_anumula గారు అభినందించారు. #T20WorldCup ‌ను గెలుచుకున్న అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన్న సిరాజ్ ముఖ్యమంత్రిగారిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సిరాజ్‌ను ఘనంగా సన్మానించారు.
#T20WorldCup2024 లో సిరాజ్‌ అద్భుతమైన ప్రతిభను కనబరిచారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. సిరాజ్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన స్థలాన్ని గుర్తించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిగారు అధికారులను ఆదేశించారు." అంటూ తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది.


Tags:    

Similar News