షేక్ పేట్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన కేటీఆర్

నూతన సంవత్సరంలో హైదరాబాద్ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరతాయని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

Update: 2022-01-01 08:31 GMT

నూతన సంవత్సరంలో హైదరాబాద్ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరతాయని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. న్యూ, ఓల్డ్ సిటీలను కలిపే ఫ్లై ఓవర్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు. షేక్ పేట్ లో నిర్మించిన ఫ్లై ఓవర్ ను కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ తో పాటు తలసాని శ్రీనివాసయాదవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్రాఫిక్ సమస్యలు....
షేక్ పేట్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించడంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లేనని అన్నారు. మొహిదీపట్నం నుంచి గచ్చిబౌలికి ఈ ఫ్లైఓవర్ మీదుగా సులువుగా చేరుకోవచ్చని తెలిపారు. 2.71 కిలోమీటర్ల ఫ్లై ఓవర్ ను 333 కోట్ల తో నిర్మించామని చెప్పారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలను తొలగించడంలో భాగంగా ఫ్లై ఓవర్ల నిర్మాణాన్ని చేపట్టినట్లు కేటీఆర్ అన్నారు.


Tags:    

Similar News