ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాం లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు బయటకు రావడం సంచలనంగా మారింది.

Update: 2022-12-01 02:27 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. నిన్న అరెస్ట్ చేసిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు పేర్కొన్నారు. సౌత్ గ్రూప్ ను నియంత్రించి వందల కోట్ల రూపాయల ముడుపులను కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి చెల్లించారని ఈ రిపోర్టు లో పేర్కొన్నారు.

రిమాండ్ రిపోర్ట్ లో...
సౌత్ గ్రూప్ ను నియంత్రించిందంతా శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, కల్వకుంట్ల కవిత అని ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్లను విజయ్ నాయర్ కు చేర్చినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని అమిత్ అరోరా ధృవీకరించారని పేర్కొన్నారు. 36 మంది 1.38 కోట్ల విలువైన 170 మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించింది. ఆధారాలను దొరకకుండా చేశారని ఈడీ పేర్కొంది. ఫోన్లు మార్చిన వారిలో శరత్ రెడ్డి, బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, సృజన్ రెడ్డిలు ఉన్నారని తెలిపింది.


Tags:    

Similar News