సంగారెడ్డి జిల్లా జైలుకు జాతీయ మానవ హక్కుల కమిషన్

సంగారెడ్డి జైలుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ చేరుకుంది.;

Update: 2024-11-24 06:56 GMT
national human rights commission, lagacharla victims,  reached , sangareddy jail
  • whatsapp icon

సంగారెడ్డి జైలుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ చేరుకుంది. లగచర్ల ఘటనలో బాధితులను అడిగి వివరాలను తెలుసుకోనుంది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం సంగారెడ్డి జైలుకు చేరుకుని బాధితుల నుంచి వివరాలను సేకరించనుంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ లో కలెక్టర్ పై దాడి కేసులో కొందరు గిరిజనులను ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఫిర్యాదు చేయడంతో...
దీనిపై బాధితుల బంధువులతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో మానవ హక్కుల కమిషన్ బృందం సభ్యులు సంగారెడ్డి జిల్లా జైలుకు చేరుకుని వారిని అడిగి వివరాలను తెలుసుకోనున్నారు. సంఘటన జరిగిన పరిస్థితులతో పాటు తర్వాత జరిగిన పరిణామాలను బాధితుల నుంచి సేకరించనున్నారు.


Tags:    

Similar News