పిడిగుద్దుల పండగ
హోలీ సందర్భంగా ఒక వింత ఆట నిజామాబాద్ జిల్లాలో జరుగుతుంది. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకోవడం సంప్రదాయంగా వస్తుంది
హోలీ సందర్భంగా ఒక వింత ఆట నిజామాబాద్ జిల్లాలో జరుగుతుంది. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకోవడం సంప్రదాయంగా వస్తుంది. నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హున్సా గ్రామంలో ఏటా హోలీ సందర్భంగా ఈ క్రీడ జరుగుతుంది. హోలీ ఆడిన తర్వాత సాయంత్రం పూట హనుమాన్ ఆలయం వద్ద గ్రామస్థులందరూ చేరతారు.
ఆట నిర్వహించకుంటే...
తాడుకు ఇరువైపులా నిలబడి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటారు. అయితే ఈ సందర్భంగా కొందరికి తీవ్ర గాయాలు కూడా అవుతాయి. రక్తం కారుతున్న కాముని బూడిదతో తుడుచుకుంటే తగ్గుతుందని అందరూ భావిస్తారు. ఆట ముగియగానే అందరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఈ ఆట నిర్వహించకుంటే గ్రామానికి చెడు జరుగుతుందని భావిస్తారు.