Breaking : "టైగర్ నాగేశ్వరరావు" నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు

హైదరాబాద్ లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ అధికారులు మరోసారి దాడులు చేస్తున్నారు;

Update: 2023-10-11 07:14 GMT
income tax raids, hyderabad
  • whatsapp icon

హైదరాబాద్ లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ అధికారులు మరోసారి దాడులు చేస్తున్నారు. సినీ నిర్మాత ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. సినీ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. పెద్దయెత్తున ఆదాయపు పన్ను ఎగవేశారన్న ఆరోపణలతో ఈ దాడులు చేస్తున్నట్లు తెలిసింది.

సినీ నిర్మాత ఇంట్లో..
అభిషేక్ అగర్వాల్ టైగర్ నాగేశ్వరరావు సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన హీరో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా నిర్మాతగా ఉండటంతో రెండు ఆదాయపు పన్ను శాఖ బృందాలు ఈ సోదాలు జరుగుతున్నాయి. సినిమాకు పెట్టిన పెట్టుబడులు ఎంత? ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.


Tags:    

Similar News