Telangana : పెండింగ్ చలాన్లకు ఊహించని రెస్పాన్స్.. కోట్ల రూపాయలు
వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నారు. కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది
వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నారు. పెద్ద సంఖ్యలో పెండింగ్ చలాన్లను చెల్లింపు చేయడంతో ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం లభించింది. పెండింగ్ చలాన్లను చెల్లించడానికి పెద్ద మొత్తంలో ప్రభుత్వం రాయితీ ప్రకటించడంతో వాహనదారులు చలాన్లను చెల్లింపులు చేేసేందుకు ముందుకు వచ్చారు. ఎంతగా అంటే ఒక దశలో చెల్లింపుల తాకిడికి సర్వర్ కూడా హ్యంగ్ అయిందని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటి వరకూ...
ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 9.61 లక్షల పెండింగ్ చలాన్ల చెల్లింపులతో రూ. 8.44 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో 3.54 లక్షల చలాన్ల ద్వారా 2.62 కోట్ల రూపాయలు, సైబరాబాద్ పరిధిలో 1.82 లక్షల చలాన్ల చెల్లింపు ద్వారా 1.80 కోట్ల రూపాయలు, రాచకొండ పరిధిలో 93 వేల చలాన్లకు 76.79 రూపాయల లక్షల ఆదాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు. పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు రావడం పట్ల అధికారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.