82 ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు.. 114 మంది కోటీశ్వరులే.. కీలక నివేదిక

తెలంగాణలో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 119 మంది ఎమ్మెల్యేలలో 82 మంది తమపై క్రిమినల్ కేసులు

Update: 2023-12-07 03:39 GMT

తెలంగాణలో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 119 మంది ఎమ్మెల్యేలలో 82 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌, తెలంగాణ వాచ్‌ రిపోర్ట్‌ బుధవారం నివేదికలో వెల్లడించింది. ఈ విధంగా చూస్తే దాదాపు 69 శాతం మంది ఎమ్మెల్యేలపై క్రిమినలు కేసులు ఉన్నట్లే. ఇక 2018లో 119 ఎమ్మెల్యేలలో 73 మందిపై క్రిమినలు కేసులు ఉండగా ఈసారి ఆ సంఖ్య 82కి పెరిగిందని విడుదల చేసిన నివేదికలో తెలిపింది.

గెలిచిన ఎమ్మెల్యేలలో ఒకరు తనపై మర్డర్‌ (ఐపీసీ సెక్షన్‌ 302) కేసు ఉండగా, 7 మంది ఎమ్మెల్యేలు అటెంప్ట్‌ టు మర్డర్‌ (ఐపీసీ సెక్షన్‌ 307) కేసు ఉన్నట్లు తెలిపింది. ఇక మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తమపై మహిళలపై నేరానికి సంబంధించిన కేసు ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలో 51 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొంది.

ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌కు చెందిన 39 మంది ఎమ్మెల్యేలపై కూడా కేసులున్నాయి. అలాగే బీజేపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు,సీపీఐ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేపై, ఎమ్‌ఐఎ్‌ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో తామే స్వయంగా ప్రకటించారు.

ఇక కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 31 మంది, బీఆర్‌ఎస్‌కు చెందిన 17 మంది, బీజేపీకి చెందిన ఏడుగురు, సీపీఐకి చెందిన ఒక్క ఎమ్మెల్యే, ఎమ్‌ఐఎమ్‌ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు తమపై సీరియస్‌ క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కాన్నారు. ఇదిలా ఉంటే మొత్తం 119 మంది ఎమ్మెల్యేలలో 114 మంది అంటే 96 శాతం మంది కోటీశ్వరులేనని నివేదికలో వెల్లడించింది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన 60 మంది, బీఆర్‌ఎస్‌కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు, సీపీఐకి చెందిన ఒక్క ఎమ్మెల్యే, ఎమ్‌ఐఎమ్‌ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు తమ ఆస్తుల వివరాలను వెల్లడించే సమయంలో రూ. కోటీకి పైగా ఉన్న వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల ఆస్తుల విలువ సరాసరి రూ. 48.20 కోట్లుకాగా, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల విలువ రూ. 32.62 కోట్లు, బీజేపీ నాయకుల ఆస్తులు రూ. 21,83 కోట్లు, సీపీఐ నాయకుడి ఆస్తుల విలు రూ. 2.33 కోట్లు, ఎమ్‌ఐఎమ్‌ నాయకుల ఆస్తుల విలువ రూ. 13.19 కోట్లుగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

Tags:    

Similar News